WhatsApp Image 2024 09 05 at 08.10.27
A claim of Rs 5 Crore today by Tata AIA Life Insurance
Trinethram News : కరీంనగర్ : ప్రతి కుటుంబ పెద్ద బాధ్యతగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని, ఆర్థిక భద్రతను తన కుటుంబానికి కల్పించాలి..
కరీంనగర్ పట్టణం జ్యోతినగర్ కి చెందిన అంతగిరి రాజు ఐదు సంవత్సరాల క్రితం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 5కోట్ల కవరేజ్ టర్మ్ పాలసీ తీసుకోవడం జరిగింది. ఇటీవలే అతను అనారోగ్యంతో మృతిచెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఈ రోజు నామిని అయినా అతని భార్య శశికళకు 5 కోట్ల రూపాయల చెక్కును సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి అందజేశారు,
ఈ సందర్భంగా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను తెలియజేశారు ప్రతి కుటుంబ పెద్ద బాధ్యతగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని, ఆర్థిక భద్రత చేకూర్చుకోవాలని సూచించారు. ప్రతీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడమే టాటా ఏ ఐ ఏ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు, ఇన్స్యూరెన్స్ మరియు క్లెయిమ్ విషయంలో అపోహలు నమ్మవద్దని, నమ్మకమైన కంపెనీ నుండి ఇన్స్యూరెన్స్ తీసుకోవాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
