
Police Uncover Black Money Scam : త్రినేత్రం న్యూస్, అశ్వారావుపేట మండలం. అశ్వారావుపేట పోలీసు స్టేషన్ లో పాల్వంచ,DSP R.సతీష్ కుమార్,ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న పత్తిపాటి ప్రేమ్ చందు అనే నిందితుడిని అశ్వారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్ పేపర్లను ప్రత్యేక రసాయన ద్రావణంలో,ముంచి తే రూ.500 నోట్లు గా మారుతాయని నమ్మించి,అశ్వారావుపేట కు చెందిన మధుబాబు,నుండి ముందుగా రూ.11 లక్షలు,తీసుకొని రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు మోసం చేసినట్లు ఒప్పుకున్నాడు.
నిందితుడి వద్ద నుండి మోసానికి ఉపయోగించిన రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20,000 బ్లాక్ పేపర్లు (20 కట్టలు), బ్లాక్ పేపర్లను నోట్లుగా మారుస్తామని చెప్పందుకు ఉపయోగించిన 2 రసాయన ద్రావణాల సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు వివరాలను పాల్వంచ DSP R.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు. నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి రిమాండ్ కు తరలించారు.
నిందితుడు గతంలో కూడా నకిలీ కరెన్సీ,మోటార్ సైకిల్ దొంగతనం వంటి కేసుల్లో బాచుపల్లి, రామచంద్రపురం మరియు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో తెలిసింది. ఈ ప్రెస్ మీట్ లో అశ్వారావుపేట ఎస్సై,టీ. యయాతి,రాజు.మరియు.సి.ఐ,పింగళి నాగరాజు.పోలీసు స్టేషన్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe