జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 25 at 20.47.48

TRINETHRAM NEWS

రైల్వేస్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనబడిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి : ఏసీపీ గోదావరిఖని ఎం. రమేష్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాలు మేరకు రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోనీ రామగుండం రైల్వేస్టేషన్ లో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ఆధ్వర్యంలో రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ సంధ్య, స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులతో కలిసి రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేసి వారి వివరాలను తెలుసుకున్నారు. పార్సిల్‌ ఆఫీస్‌, రైల్వేస్టేషన్ ఏరియా తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న అండర్‌ రైల్వే రూమ్‌లు, డార్మెటరీలు, ప్రైవేట్‌ రూమ్‌లు, ఆ ప్రదేశంలో ఉన్న హోటళ్లు ను తనిఖీ చేసి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే పోలీస్ వారితో మాట్లాడి పాత నేరస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానం ఉంటే వెంటనే రైల్వేపోలీసులు, స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని ఏసీపీ సూచించారు
ఈ కార్యక్రమం గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి ఆర్ పి ఎఫ్ సీఐ సురేష్, ఎస్ఐ లు సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page