TRINETHRAM NEWS

హన్మకొండ:ఏప్రిల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు ఎట్టకేలకు పోలీసుల అనుమతి లభించింది. ఈ నెల 27న వరంగల్‌ ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతో త్సవ సభకు శనివారం సాయంత్రం నాడు వరంగల్ జిల్లా పోలీసులు అనుమతి నిచ్చారు వరంగల్‌ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్‌ ఏసీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, వినయ్‌ భాస్కర్‌, ఒడితల సతీశ్‌ కుమార్‌లు పోలీసుల నుంచి అనుమతి పత్రాలను అందుకున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో, కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా, రజ తోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది సాయంత్రం పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహ రించుకోనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 BRS Rajatotsava Sabha!