Jan Vishwas Program : జన్ విశ్వాస్ కార్యక్రమాన్ని గురించి ఆటో డ్రైవర్ లకు అవగాహన కల్పించిన పోలీసులు

TRINETHRAM NEWS
Jan Vishwas program.

Jan Vishwas Program : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి.పెనుమూరు.(త్రినేత్రం న్యూస్)జూన్2.పెనుమూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పెనుమూరు పట్టణంలో “జన్ విశ్వాస్” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆటో డ్రైవర్లతో ముఖాముఖి సమావేశమై, “జన్ విశ్వాస్” కార్యక్రమ యొక్క ముఖ్య ఉద్దేశాలు మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను వివరించడం జరిగింది. పోలీసు-ప్రజల మధ్య పరస్పర విశ్వాసం, సహకారాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఆటో డ్రైవర్‌కు 3 స్టిక్కర్ల చొప్పున పంపిణీ చేసి, వాటిని ఆటోలపై ఎలా, ఎక్కడ అమర్చుకోవాలో సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చట్టాలకు స్వచ్ఛందంగా కట్టుబడి ఉండటం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మరియు పౌర-కేంద్రిత పోలీస్ సేవల గురించి పెనుమురు ఎస్.ఐ.శ్రీనివాసులు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top