తేదీ : 15/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పడం జరిగింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఆటో రిక్షాల పరిమితిని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బియస్ 6, సియన్ జి పెట్రోల్ ఎల్పీజి ఈవీ ఆటోల సంఖ్యపై పరిమితిని ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ప్రజా రవాణాలో భాగంగా లాస్ట్ మైల్ కనె క్టివిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వల్లో పేర్కొనడం జరిగింది. గతంలో విజయవాడలో 8,700 విశాఖలో 8,400 ఆటో రిక్షాలకు మాత్రమే అనుమతి ఉండేదని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


