సుమారు రూ.40.25 లక్షల విలువైన కేసు ప్రాపర్టీ పూర్తిస్థాయిలో రికవరీ
నేరం జరిగిన వారం రోజుల్లోనే 5 మంది నిందితుల అరెస్ట్
కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్
Trinethram News : శ్రీకాకుళం : శ్రీ విజయ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం (చిన్న తిరుపతి), కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో చోరీకి గురైన సుమారు రూ.40.25 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు మరియు హుండీలోని నగదును పూర్తిస్థాయిలో రికవరీ చేసి, నిందితులను కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో వెల్లడించారు.
కేసు దర్యాప్తులో భాగంగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్, నరసన్నపేట పోలీస్ స్టేషన్ మరియు మన్యం జిల్లా బత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మొత్తం నాలుగు కేసులను విజయవంతంగా ఛేదించి, ఆయా కేసులకు సంబంధించిన కేసు ప్రాపర్టీని పూర్తిస్థాయిలో రికవరీ చేసినట్లు తెలిపారు.
కేసు వివరాలు: కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం: 08/2026 , 6½ తులాల బంగారు ఆభరణాలు,15 కేజీల వెండి ఆభరణాలు,నగదు సుమారు ₹80,000/-. దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అంశములు.వెంకటేశ్వర ఆలయంలో దొంగతనం జరిగినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నరసన్నపేట పోలీస్ స్టేషన్
క్రైమ్ నెం: 09/2026 – నగదు ₹ 2,000/- రికవరీ
క్రైమ్ నెం: 10/2026 3 గ్రాముల బంగారం రికవరీ
నిందితుల వివరాలు: A.1: కురమాన శ్రీనివాసరావు @ శ్రీను @ నాని,తండ్రి: సింహాచలం | వయస్సు: 25 సం. | కులం: ఎస్సీ (మాల)గ్రామం: గొట్టిపల్లి, ఎల్.ఎన్ పేట మండలం.
A.2: సవర బొగేష్ తండ్రి: మంగయ్య | వయస్సు: 26 సం. | కులం: ఎస్టీ (సవర)
గ్రామం: కారిగూడ, ఎల్.ఎన్ పేట మండలం.
A.3: సవర సుదర్శన్ రావు @ సిద్ధుతండ్రి: భోగన్న | వయస్సు: 25 సం. | కులం: ఎస్టీ (సవర) గ్రామం: మెట్టుగూడ, ఎల్.ఎన్ పేట మండలం.
A.4: పుల్లేటిగుర్తి చక్రధర్
తండ్రి: బెనర్జీ | వయస్సు: 37 సం. | కులం: విశ్వబ్రాహ్మణ గ్రామం & మండలం: హిరమండలం.
A.5: దార రమేష్ కుమార్,తండ్రి: లేట్ అప్పలస్వామి | వయస్సు: 36 సం. | కులం: ఎస్సీ (మాల) గ్రామం: గొట్టిపల్లి, ఎల్.ఎన్ పేట మండలం.
నేర విధానం: A.1ముద్దాయి ఆధ్వర్యంలో A.2,A.3 లు కలిసి తేదీ 03.01.2026న ఆలయాన్ని రెక్కీ చేసి, 09.01.2026 రాత్రి అక్రమంగా ఆలయంలోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలు మరియు నగదును దొంగిలించారు. దొంగిలించిన వస్తువులను A.4 సమన్వయం, సహాయంతో A.5కు అప్పగించారు.
నిందితులు గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రసిద్ధ ఆలయాలను పరిశీలించి, ఆలయ ఫోటోల ఆధారంగా విలువైన ఆభరణాలను లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల DVR బాక్స్‌ను తొలగించి చెరువులో పడవేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కిటికీ మెష్‌ను తొలగించి లోపలికి ప్రవేశించి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. అనంతరం DVR బాక్స్‌ను కూడా పోలీసులు రికవరీ చేశారు.
గత నేర చరిత్ర: A.1: 38 చోరీ కేసులు – అన్ని కేసుల్లో జైలుకు వెళ్ళినారు.
A.2: 10 చోరీ కేసులు – అన్ని కేసుల్లో జైలుకు వెళ్ళినారు.
A.3: 7 చోరీ కేసులు – అన్ని కేసుల్లో జైలుకు వెళ్ళినారు.
ప్రతిభకు ప్రశంస: జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి మార్గదర్శకత్వంలో కాశీబుగ్గ సబ్ డివిజన్ పోలీస్ అధికారి షేక్ సహాబాజ్ అహ్మద్, కాశీబుగ్గ ఇన్‌స్పెక్టర్ ఎన్ని రామకృష్ణ సమర్థవంతంగా కేసును ఛేదించారు.ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ ఆర్.నరసింహమూర్తి, బి. గవరయ్య (HC 1137), ఎస్. ఉషాకిరణ్ (PC 2058),ఎం. నీలకంఠం (PC 2139), జి. షణ్ముఖరావు (PC 661), సీహెచ్. వి. సత్యం (HC 1352 – IT CORE) గారిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
భద్రతపై సూచనలు: ఆలయాల వద్ద భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపరచాలని జిల్లా ఎస్పీ సూచించారు. DVR బాక్స్‌ను బలమైన గదిలో ఏర్పాటు చేసి, మొబైల్ ఫోన్‌లకు అనుసంధానం చేసే విధంగా భద్రతా చర్యలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులకు మీడియా ద్వారా జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఈ పత్రిక సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ కేవీ రమణ, కాశీబుగ్గ డిఎస్పి షేక్ సాహబాజ్ ఆహమ్మద్, ఇన్స్పెక్టర్లు ఇమాన్యుల్ రాజు, రామకృష్ణ, ఎస్సై నరసింహ మూర్తి పోలీస్ సిబ్బంది ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


