Meena thanked MLA : ఎమ్మెల్యే వేగుళ్ళ కు కృతజ్ఞతలు తెలిపిన పిల్లి మీనా

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, తెలుగుదేశంపార్టీ అమలాపురం పార్లమెంట్ మెయిన్ కమిటీ కార్యదర్శి గా నియమితులైన పిల్లి మీనా శనివారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావునీ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సంధర్బంగా తనపై నమ్మకంతో పార్లమెంట్ కమిటీ లో కార్యదర్శిగా నియమించినందుకు ఎమ్మెల్యే వేగుళ్ళ కు పుష్పగుచ్చం అందజేసి, దుశ్శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండపేట మండల మాజీ అధ్యక్షులు యరగతపు బాబ్జి, ద్వారపూడి గ్రామశాఖ అధ్యక్షులు సత్తి సత్యనారాయణ, జెడ్.మేడపాడు సొసైటి చైర్మన్ సలాది బాలసుబ్రహ్మణ్యం, చింతా దొరబాబు, వర్రె వీరబాబు, కొవ్వల రాజు, దాట్ల కృష్ణంరాజు, సత్తింశెట్టి అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pilli Meena thanked MLA Vegulla

You cannot copy content of this page

Scroll to Top