Collector P Prashanthi : సోమవారం మే 5 వ తేదీన కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ నిర్వహణ

TRINETHRAM NEWS

“1100 ” టోల్ ఫ్రీ నెంబర్ కు నేరుగా ఫిర్యాదు చెయ్యవొచ్చు లేదా ఫిర్యాదు స్థాయి తెలుసుకోవచ్చు

కలెక్టర్ పి ప్రశాంతి

Trinethram News : రాజమహేంద్రవరం : ప్రజా సమస్యలు పరిష్కార కోసం “1100 మీకోసం కాల్ సెంటర్” ద్వారా ఫిర్యాదు నమోదు చేయుట మరియు నమోదైన మీ ఫిర్యాదు యొక్క స్థితిగతులు తెలుసుకో వచ్చునని, జిల్లా డివిజన్ మండల లో నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ యధావిధిగా సోమవారం మే 5 వ తేదీన నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం  ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ ,  మండల కేంద్రంలో ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ప్రజల నుంచి పీజీఆర్ఎస్ అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక అధికారులు , జిల్లా, డివిజన్ మండల, మునిసిపల్ క్షేత్ర స్థాయి అధికారులు తప్పనిసరిగా హజరు కావాలని స్పష్టం చేశారు.

ప్రజలు వ్యయ ప్రయసలుపడి ప్రభుత్వ కార్యాలయాలకు వొచ్చి ఫిర్యాదు చెయ్యకుండా “1100” టోల్ ఫ్రీ నెంబర్ కు నేరుగా తమ సమస్యలను తెలియ చేయడం ద్వారా కూడా పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలియ చేశారు. మీకోసం ద్వారా నమోదు చేసిన ఫిర్యాదు యొక్క స్థితి తెలుసుకునే అవకాశం ఉందన్నారు.. సత్వర పౌర సేవలను పొందేందుకు ప్రభుత్వం అమలులోకి తీసుకుని వొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ను తమ సెల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పలు పౌర సేవలు అందుబాటులో తీసుకుని రావడం జరిగిందనీ పేర్కొన్నారు. నీటి తీరువా , తదితర పన్నుల చెల్లింపులు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెల్లించే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ పరమైన సేవలు అందుబాటులోకి రావడం వల్ల అధికారులు చూట్టు తిరిగే అవసరం లేకుండా మీ మొబైల్ ఫోన్ కే ఆయా సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం విశేషం అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PGRS to be held at

You cannot copy content of this page

Scroll to Top