Intermediate Admissions : తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకుదరఖాస్తుల ఆహ్వానం

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) మే 3 త్రినేత్రం న్యూస్ : దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం పదవ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డి.నారాయణరెడ్డి తెలిపారు.ప్రథమ సంవత్సరానికి తరగతుల వారిగా ఎంపీసీలో 40 సీట్లు, బైపీసీలో 40 సీట్లు, సీఈసీలో 40 సీట్లు, ఎంఈసి లో 40 సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు తేదీ 05-05-2025 నుండి 20-5-2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, సువిశాలమైన తరగతి గదులు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, డిజిటల్ విద్యాబోధన ,ఆహ్లాదకరమైన వాతావరణం, పి ఎం శ్రీ లో భాగంగా విద్యా విహారయాత్రలు, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ , సుదూర ప్రాంత విద్యార్థినిలకు హాస్టల్ వసతి కల్పించబడుతుందని విద్యార్థులుసంబంధిత సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Applications invited for admissions

You cannot copy content of this page

Scroll to Top