జూలై 23, 2026
TRINETHRAM NEWS
PG RS cancelled

PG RS Cancelled : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 07; జిల్లా కేంద్రమైన భీమవరంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈనెల అనగా సోమవారం ఎనిమిది వ తేదీన రద్దు చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుగొండ మండలం , సిద్ధాంతం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం ఆ పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమై ఉండడంతో నిర్ణయం తీసుకున్నారు. దీంతో , జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page