జూలై 23, 2026
TRINETHRAM NEWS
Alluri Seetharamaraju Chalivendram

(క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో)

(సేవే మా ధ్యేయం – సమాజ సేవే మా లక్ష్యం)

Alluri Seetharamaraju : కూకట్పల్లి జూన్ 7 (త్రినేత్రం న్యూస్) : 2021లో ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు చలివేంద్రం, 2026లో విజయవంతంగా 6వ సంవత్సరంలోకి ప్రవేశించి మరోసారి సమాజ సేవలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఉగాది సందర్భంగా 19-03-2026 న ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం, 07-06-2026 నాటికి మొత్తం 81 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించబడింది.ఈ చలివేంద్రం ద్వారా సుమారు 3- 4 లక్షల మందికి చల్లని మంచినీరు మరియు మజ్జిగ అందించబడింది.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతిరోజ సహకరించిన దాతలకు, శని మరియు ఆదివారాల్లో తమ వ్యక్తిగత పనులను పక్కన పెట్టి సేవా కార్యక్రమంలో పాల్గొన్న కెవైఎఫ్ సభ్యులందరికీ, మజ్జిగ తయారీలో సహకరించిన , ఎస్కెఎఫ్ టీంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే 81 రోజుల పాటు నిరంతరాయంగా సేవలందించిన ఇద్దరు యువకుల సేవలను గుర్తించి, క్షత్రియ యూత్ ఫెడరేషన్ తరఫున వారికి బట్టలు మరియు స్వీట్ బాక్స్‌లు బహూకరించడం జరిగింది. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ క్షత్రియ యూత్ ఫెడరేషన్ (కెవైఎఫ్) తరఫున హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page