Protest : కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ కై నిరసన ధర్నా

TRINETHRAM NEWS

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పనులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించొద్దు.
Trinethram News : కాకినాడ,ఫిబ్రవరి,24: కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ను రద్దుపరిస్తే మున్సిపల్ శాఖకే ఆ బాధ్యత వహించాలని, వీటిని ప్రైవేట్ వ్యక్తులకు, బడా కంపెనీలకు వారి ఏజెన్సీలకు అప్పచెప్పుదామనే మంత్రి వర్గ సభ్యుల అభిప్రాయాలు పత్రికల్లో ప్రకటించడంపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ AITUC అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దసలవారీ వారి పోరాటాలకు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం యూనియన్ ప్రధాన కార్యదర్శి తుపాకల లక్ష్మీనారాయణ అధ్యక్షతన కాకినాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా జరిగింది.

ఈ నిరసన ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిప్రభుత్వం ఆప్కాస్ ను రద్దుపరిస్తే మున్సిపల్ శాఖ కి ఆ బాధ్యతలు అప్పగించాలని, కనీస వేతనలు 35000 చెల్లించాలని, మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాలు చెల్లింపు, పనులు అప్పగింత నిర్వహణ, సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యతలు ఉండాలని, ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలకు అప్పగించొద్దని ప్రసాద్ డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పాశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ తక్షణమే పర్మినెంట్ చేయాలని ఈ నిరసన ధర్నా చేపడుతున్నామని ఆయన అన్నారు.

కార్మికులకు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లో ఎన్కోస్మెంట్ మరియు మూడు డిఏలు తక్షణమే విడుదల చేయాలని, ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంపుకే గత సమ్మెలో నాటి ప్రభుత్వంతో అంగీకారమైన అగ్రిమెంట్ మేరకు వేతనాలు పెంచాలని, జనాభా ప్రతిపదికన కార్మికులను పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని కార్మికులకువర్తించాలని, 15 సంవత్సరాలుగా స్కూల్స్ స్వీపర్ల వేతనాలు పెంచలేదని, తక్షణమే వారికి వేతనాలు పెంచాలని, ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న మరణించిన రిటైర్మెంట్ కార్డు ప్రస్థానంలో వారి కుటుంబ సభ్యులకు పనులు అవకాశం కల్పించాలని, రెగ్యులర్ ఉద్యోగ, కార్మికుల వలె కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల ఉద్యోగ కార్మికుల రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, కాకినాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ లో పనిముట్లు కొడతా తీర్చాలని, బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని, అన్ని సర్కిల్లో ఇన్చార్జిలతో కాకుండా పర్మనెంట్ ఇన్స్పెక్టర్ల నియమించాలని, ధర్నా అనంతరం కమిషనర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగిందని ప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో బంగారు సింహాచలం, బంగారు రాజేష్, బొబ్బిలి ఈశ్వరరావు, నిమ్మకాయల ఈశ్వరరావు, ధనాల శీను, సింగంపల్లి రమణ, రాయలపూడి వెంకటరావు, వడ్డాది శ్రీను, బంగారు దుర్గ, జనిపల్లి అప్పన్న, లక్ష్మణ్, ఏ సుబ్రహ్మణ్యం తదితర సర్కిల్ లీడర్స్ పారిశుద్ధ్య కార్మికులు అధిక స్థాయిలోపాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top