కేతావత్ బాబు రామ్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ – గిరిజన సంక్షేమ సంఘం, మరియు
జిల్లా అధ్యక్షులు .
దేవరకొండ ఆగష్టు 13 త్రినేత్రం న్యూస్. భారత రాజ్యాంగం ప్రజల హక్కులు, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం రూపుదిద్దుకున్న పవిత్ర పత్రం అని కేతావత్ బాబు రామ్ నాయక్ పేర్కొన్నారు. గత ఏడు దశాబ్దాల పాలకుల స్వార్థపూరిత నిర్ణయాలు, అవినీతి, అధికార దుర్వినియోగం వల్ల ఆ పవిత్రత దెబ్బతిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రజాసేవ కంటే వ్యక్తిగత లాభాల కోసం రాజకీయాల్లోకి వచ్చే వారు ఎక్కువైపోయారని, ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, ప్రలోభాలతో ఓట్లు కొనుగోలు చేసే అభ్యర్థులు గెలిచిన తర్వాత ప్రజలకు న్యాయం చేయలేరని ఆయన స్పష్టం చేశారు.
ఆయన ప్రజలకు పిలుపునిస్తూ – “మీ ఓటు పవిత్రం. దానిని మద్యం, డబ్బు, ప్రలోభాలకు అమ్మడం అనేది మీ భవిష్యత్తునే అమ్మేసినట్లు కాబట్టి ఓటు హక్కును జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని, హితవు పలికారు. లోకల్ బాడీ ఎన్నికలే మార్పుకు ఆరంభమని ఆయన పేర్కొన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని, పార్టీ ఆదేశాలకు కాకుండా నిజమైన ప్రజా సేవ కోసం కృషి చేసే అభ్యర్థులకు అవకాశమివ్వాలని ప్రజలను కోరారు. గ్రామంలో మార్పు మొదలైతేనే రాష్ట్ర, దేశ స్థాయిలో మంచి పాలన వస్తుందని తెలిపారు.
ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు త్వరలో జరగబోయే ఎన్నికలలో లోకల్ బాడీ నుండి పార్లమెంట్ వరకు నిజమైన ప్రజాసేవకులను మాత్రమే ఎన్నుకోవాలని డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు లొంగక, అదేవిధంగా గ్రామస్థాయిలోనే మార్పు ప్రారంభించి రాష్ట్రం, దేశ అభివృద్ధికి దోహదపడాలని మరియు ఓటు హక్కును పవిత్రమైన బాధ్యతగా భావించి సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు .అదేవిధంగా “ప్రజల భవిష్యత్తు, వారి ఓటు బలంపై ఆధారపడి ఉంటుందని. ప్రతి ఓటు దేశానికి దిశానిర్దేశం చేసే శక్తి కలిగివుందని. దానిని అమ్మేయడం అంటే మీ హక్కును, మీ భవిష్యత్తును వదిలిపెట్టే తప్పిదం అవుతుందని ఆయన అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


