MLA K.P. Vivekananda : ప్రజల సమస్యలు నా సమస్యలే.. నియోజకవర్గ సమగ్ర అభివృద్దే నా ప్రధమ కర్తవ్యం

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకోవడం, వెంటనే పరిష్కారం అందించడం లక్ష్యంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద ప్రతీరోజు ఉదయం తన నివాసంలో ప్రజలకు అందుబాటులో వుంటూ వారితో మిఖా ముఖా-ముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.

ఇందులో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలు పాల్గొని డ్రైనేజ్, రోడ్లు, మంచినీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, పింఛన్లు, హౌసింగ్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమస్యలు ఎమ్మెల్యే కి వివరించారు. ప్రతీ ఒక్కరి ఫిర్యాదును శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే , సంబంధిత శాఖ అధికారులను టెలిఫోన్ ద్వారా సంప్రదించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ:
“ప్రజల సమస్యలు నా సమస్యలే. ప్రతి ఒక్కరు నన్ను నమ్మి వచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత. నేను ప్రజల అభిప్రాయాలను శ్రద్ధగా విని, వారితో కలిసి సమస్యలకు శాశ్వత పరిష్కారాల కోసం కృషి చేస్తాను.” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత, సంక్షేమ సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

People's problems are my

You cannot copy content of this page

Scroll to Top