ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2025 01 16 at 17.05.21

TRINETHRAM NEWS

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో పీఆర్ అధికారులతో రివ్యూలో ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

భూపాలపల్లి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అన్ని అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. ఈరోజు(గురువారం)భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పీఆర్ ఎస్ఈ, ఈఈ, డీఈ, ఏఈ లతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కొన్ని గ్రామాలల్లో రోడ్ల అభివృద్ధి పనులను ఎందుకు ప్రారంభించలేదని, అందుకు గల కారణాలను తెలుసుకుని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు గుత్తేదారులతో పనులను యుద్ధప్రాతిపదికన పనులను ప్రారంభించి నెల రోజుల లోపు పూర్తి చేయించాలని కోరారు. కొన్ని గ్రామాలల్లో మహిళా సమైఖ్య భవనాలకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా, పనులు పూర్తి చేయకపోవడం పట్ల అధికారులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా, కొన్ని చోట్ల ఇంకా జీపీ బిల్డింగ్స్ నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని, ఆ పనులను కూడా త్వరలోనే పూర్తి చేయాలని సూచించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page