MP Gaddam Vamsi Krishna : ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్ తరపున గళమెత్తిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

TRINETHRAM NEWS

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. న్యూయార్క్, అక్టోబర్ 2025: ప్రపంచ దేశాలన్నీ కలిసి అభివృద్ధి చెందాలన్నదే భారతదేశం ఆశయం అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి ఉన్న రెండో కమిటీలోని మ్యాక్రో ఎకనామిక్ పాలసీ ప్రశ్నలు మరియు ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్‌మెంట్ పై సాధారణ చర్చలో ఆయన భారతదేశం తరఫున ప్రసంగించారు ఎంపీ వంశీ కృష్ణ మాట్లాడుతూ “ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సంక్షోభ దశలో ఉంది. వృద్ధి మందగించింది.

ఇలాంటి సమయంలో ప్రపంచ వాణిజ్యం సమ్మిళిత వృద్ధికి ఇంజిన్‌లా పనిచేయాలి. న్యాయమైన, పారదర్శకమైన, సమగ్ర వాణిజ్య వ్యవస్థకే భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుంది” అని పేర్కొన్నారు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు అవసరమని, అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుక ప్రపంచ వేదికలపై వినిపించాలన్నది భారతదేశం అభిప్రాయం అని తెలిపారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ఆధ్వర్యంలో ఉన్న అంతర్జాతీయ వ్యాపార నియమాలకు దేశాలన్నీ కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం గ్లోబల్ వ్యాల్యూ చైన్‌లో పెరగాలి, అప్పుల పారదర్శకత మరియు సమర్థవంతమైన నిర్వహణ అత్యవసరం అని ఎంపీ పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MP Gaddam Vamsi Krishna speaks on behalf of India

You cannot copy content of this page

Scroll to Top