జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 29 at 14.24.15

TRINETHRAM NEWS

కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టనున్న పవన్‌కల్యాణ్‌

Trinethram News : కాకినాడ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) నేడు కాకినాడ(Kakinada)లో పర్యటించనున్నారు. యాంకరేజి పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టనున్నారు..

ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పవన్‌.. నేరుగా కాకినాడకు బయల్దేరారు..

పోర్టు నుంచి పేదల బియ్యం(పీడీఎస్‌) విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం తనిఖీలకు నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్‌ నౌకలో 640 మెట్రిక్‌ టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించిన విషయం తెలిసిందే..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page