WhatsApp Image 2024 03 26 at 19.23.45
Trinethram News : అమరావతి: జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పార్టీ కోసం రూ.10 కోట్ల విరాళం ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం అందజేస్తున్నట్లు వెల్లడించారు..
దీనికి సంబంధించిన చెక్కును పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు సమక్షంలో కోశాధికారి ఎ.వి.రత్నంకి అందజేశారు..
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..”స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని విరాళంగా ఇచ్చారు. జనసేన కోసం ఓ బెల్దారీ మేస్త్రి రూ.లక్ష విరాళం అందించారు. ఇలా ఎందరో కూలీలు కూడా రూ.100, రూ.200 చొప్పున విరాళాలు ఇచ్చారు. అలాంటి వారి స్ఫూర్తితో సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని, ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన తర్వాత మిగిలిన డబ్బును పార్టీకి విరాళంగా ఇవ్వడం సంతోషంగా ఉంది. ఎన్నికల వేళ ఈ మొత్తం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నా” అని పేర్కొన్నారు..
