ధ్వజ స్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం లో పాల్గొన్న
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు
నేనావత్ కిషన్ నాయక్
దేవరకొండ జులై 31 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలో గన్యా నాయక్ తండా గ్రామం పరిధిలోని పాలత్య తండా లో సత్తి దేవాలయం ధ్వజ స్తంభం ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కిషన్ నాయక్ పాల్గొని ధ్వజస్తంభం ప్రతి ష్టాపన చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనలతో , తండా ప్రజలు సంప్రాదయ నృత్యాలతో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నేనావత్ కిషన్ నాయక్ కు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సత్తి దేవాలయం నిర్మాణం లో నేను పాలుపంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్న అనిఅన్నారు .దేవాలయం నిర్మాణమే కాకుండా తండా అబివృద్దికి నిరంతరం సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు. అదే విదంగా సత్తి దేవుని ఆశీర్వాదం తండా ప్రజలపై ఎల్లపుడు ఉండాలి అని అన్నారు .ఈ కార్యక్రమం లో తండా ప్రజలు , నాయకులూ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


