Majjivalsa Tribals Protest : మజ్జివల్స గిరిజనుల నిరసన భూములకు పరిహారం, ఉద్యోగాలు కల్పించాలంటూ డిమాండ్

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ, ఆగస్టు 01 (త్రినేత్రం న్యూస్): అరకువేలి మండలం బొండం పంచాయతీ మజ్జివల్స గ్రామంలో ఏకలవ్య స్కూలు నిర్మాణానికి భూములు ఇచ్చి మోసపోయిన గిరిజనులు స్కూలు ఎదుట నిరసన తెలిపారు.
2018-19లో 16 మంది గిరిజనుల నుంచి 18 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించినప్పటికీ, ఇప్పటివరకు పరిహారం లేకుండా, ఉద్యోగ హామీలు నెరవేర్చకుండా మోసం చేశారని గిరిజనులు ఆరోపించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించాలి,” అని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో జిల్లా కార్యదర్శి పీ.బలదేవ్, మండల కార్యదర్శి జి.బుజ్జిబాబు, మండల ఉపాధ్యక్షుడు కె.రామారావు, గ్రామ నాయకులు కె.అప్పన్న, గొల్లూరి పరశురాం, కొర్రనాగమణి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Majjivalsa tribals protest demanding

You cannot copy content of this page

Scroll to Top