MLA Balu Naik : అంబా భవాని లిప్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిని పరిశీలించిన ఎం ఎఎల్ ఏ .బాలు నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ మే 22 త్రినేత్రం న్యూస్. ప్రతి సెంటు గుంటకు సాగు నీరు అందిస్తా. భూ నిర్వాసితులకు అన్ని విధాలుగా ఆదుకుంటాం. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తాం. వచ్చే జూన్ నాటికి అంబాభవాని లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి, రైతాంగానికి సాగు నీరు అందిస్తా. గత పాలకుల చేతిలో ఎడారిగా మారిన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా.

ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్*

నేరేడుగోమ్ము మండలంలోని చిన్నమునిగల్ గ్రామ సమీపంలో గల అంబాభవాని లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిని ఇరిగేషన్ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి, ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేసి, రైతాంగానికి సాగు నీరు అందించాలని అధికారులను,కాంట్రాక్టర్ లను ఎం ఎల్ ఏ ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అంబాభవాని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు త్వరలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి భూ నిర్వాసితులకు ఆదుకుంటాం అని అన్నారు. అంబాభవాని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు 184కోట్ల రూపాయలు మంజూరు.

ఈ ప్రాజెక్ట్ వచ్చే జూన్ నెల నాటికి త్వరితగతిన పూర్తి చేసి,రైతాంగానికి సాగు నీరు అందించాలని అధికారులకు సూచించారు. AKBR ప్రాజెక్ట్ తక్కువ సమయంలో పూర్తి చేసి, రైతాంగానికి సాగు నీరు అందిస్తాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి,ఇరిగేషన్ శాఖ SC బద్రు నాయక్,RDO రమణా రెడ్డి,EE యాలమంద, కామ నెహ్రూ,DE లు,AE లు, కాంట్రాక్ట్ హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల్ల వెంకటయ్య గౌడ్, PACs చైర్మన్ కొండ్ర శ్రీశైలం యాదవ్,మండల పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య, మాజీ ఎంపీపీలు బిక్కు నాయక్, ఏడ్పుల గోవింద్ యాదవ్, సర్వయ్య యాదవ్, మాజీ జడ్పీటీసీ బాలు నాయక్, సీనియర్ నాయకులు పాప నాయక్, యుగేందర్ రెడ్డి,వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,మండల యూత్ అధ్యక్షులు ఆంజనేయులు,యువ నాయకులు సుభాష్ నాయక్,జైపాల్ నాయక్, శేఖర్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Balu Naik inspects

You cannot copy content of this page

Scroll to Top