త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 16 నెల్లూరు జిల్లా: కావలి .. ఇటీవల స్కూల్ పిల్లలు ఆటోలో స్కూళ్లకు వెళుతున్నారు వస్తున్నారు, ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ తన జీవనార్థం దృష్టిలో పెట్టుకొని ఓవర్ లోడ్ అంటే ఎక్కువ మంది పిల్లలను ఆటోలో ఎక్కించుకోవడం వలన పిల్లలు ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి, డ్రైవర్ ,సీటుపై పక్క చిన్న బిడ్డలను, కూర్చోబెడతారు వాళ్ళు కాళ్ళు కూడా బయటే ఉంటున్నాయి, వాళ్లకు తెలియదు కాళ్లు బయట పెడితే ప్రమాదమని అంత మాత్రమే కాదు బిడ్డలు కూర్చునేటకు స్థలము కూడా లేని పరిస్థితి, కాబట్టి ఇది అధికారులు గమనించాల పసిబిడ్డల విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి ఒక చిన్న పొరపాటు వల్ల ఎంతో మంది జీవితాలు బాధిస్తాయి.
ఒక ఆటోలో పరిమితానికి మించి చిన్న పిల్లలను కూర్చోబెట్టి తీసుకుపోవడం అన్నది చాలా దారుణం తల్లితండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించడం లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు బిడ్డలు స్కూల్ కి వెళ్తున్నారు వస్తున్నారు అంతవరకే చూస్తున్నారు గాని ఆ ఆటోలో చాలీచాలని స్థలములో బిడ్డలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ,అది గమనించడం లేదు. తక్షణమే ఇలాంటి, విషయాలపై అధికారులు స్పందించాలని ఆటోలో ప్రయాణిస్తున్న చిన్న బిడ్డలను చూస్తున్న ప్రజలు కోరుతున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


