T. Rammohan Reddy : పండుగ సాయన్న జీవితం స్ఫూర్తిదాయకం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. పండుగ సాయన్న జయంతి సందర్భంగా పరిగి పట్టణంలోని పండుగ సాయన్న విగ్రహనికి పరిగి ఎమ్మెల్యే డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ. సమాజంలో పేదరికంతో అలమటిస్తున్న ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడు పండుగ సాయన్న జీవితం స్ఫూర్తిదాయకమని,సాయన్న త్యాగాలను స్మరించుకుంటూ,వారి ఆశయాల సాధనకు కట్టుబడి ఉండాలని అన్నారు.

అదేవిధంగా పరిగిపట్టణంలో ముదిరాజ్ సోదరులు ముదిరాజ్ భవనాన్ని నిర్మించాలని కోరడం జరిగిందని ఇదే విషయాన్ని కలెక్టర్ తో కూడా చర్చించడం జరిగిందని,అతి త్వరలోనే ముదిరాజ్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించి తానే స్వయంగా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే
TRR తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Panduga Sayanna's life is

You cannot copy content of this page

Scroll to Top