ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Palla Venkat Reddy

సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి.

Palla Venkat Reddy : డిండి( గుండ్ల పల్లి) ,ఆగస్టు 09 , త్రినేత్రం న్యూస్. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా, సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని డిండి మండలంలో ఆదివారం పర్యటించారు.సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా డిండి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో సిపిఐ ప్రజా చైతన్య యాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు .గ్రామంలో డప్పు కళాకారుల పాటలతో ర్యాలీ నిర్వహించారు.

అనంతరం బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన సభలో వెంకటరెడ్డి మాట్లాడుతూ, విపరీతంగా ధరలను పెంచి సామాన్యులు బతకలేని పరిస్థితిని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, పెట్రోలు, డీజిల్ వంట గ్యాస్ ధరల పెంపు అడ్డు అదుపు లేకుండా పెంచుతున్నారని, ప్రజలపై ఏమాత్రం బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీకి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు .విద్యా వ్యవస్థను గాడిన పెట్టలేని కేంద్ర బిజెపి సర్కార్ యువత నుండి వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవడంలో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను రంగంలోకి దించిందని ,ఢిల్లీ జంతర్మంతర్ లో ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో యువతరంపై అబద్ధాలు ప్రచారం చేస్తూ విదేశీ ఫండ్స్ తోని ఈ దేశంలో పాలకవర్గాలను కూల్చే కుట్రలు చేస్తున్నారని రకరకాల వదంతులు వ్యాప్తి చేస్తూ, విద్యార్థులు దేశద్రోహులని ముద్ర వేసి, తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు.

కనీస వేతనాలు అందుకోలేని కార్మిక వర్గం శ్రమ దోపిడికి గురవుతుందని ,మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ వచ్చిన తర్వాత లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ,మరింత నిరుద్యోగం పెంచే విధంగా బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు అనుకూల విధానాలు చేస్తుందని ఆయన విమర్శించారు.అనంతరం ప్రజా చైతన్య యాత్ర బైక్ ర్యాలీని జెండా ఊపి వెంకటరెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, సిపిఐ జిల్లా కార్యదర్శి బుచ్చిరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మైనుద్దీన్, డిండి ,దేవరకొండ, చందంపేట ,నేరేడు గుమ్ము, మండల పార్టీ కార్యదర్శులు కనకాచారి ,సుదర్శన్ రెడ్డి, వెంకటయ్య రామాంజనేయులు ,సర్పంచి ప్రతిమ విజయేందర్ రెడ్డి, నాయకులు ,జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకటరమణ, రామస్వామి, శైలేష్, రంగారెడ్డి ,మండల కార్యవర్గ సభ్యులు ,ప్రజ సంఘాల నాయకులు నూనె వెంకటేశ్వర్లు, వెంగళయ్య, ఎనమల్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page