MLA Yashaswini Reddy : పాలకుర్తి నియోజకవర్గం లో భూ భారతి చట్టం అవగహన సదస్సు ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

TRINETHRAM NEWS

పాలకుర్తి నియోజకవర్గం లో భూ భారతి చట్టం అవగహన సదస్సు ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

జనవరి28(త్రినేత్రంన్యూస్ )

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ భూ భారతి చట్టం ఇతర భూ చట్టాల పై రైతులకు అవగాహన కల్పించేందుకు ముఖాముఖి అవగాహన మొదటి ప్రారంభ సదస్సును ఈనెల 29న పాలకుర్తిలోని బృందావన్ గార్డెన్ లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని
ఈ కార్యక్రమానికి కొత్త ఆర్ ఓ ఆర్ భూ భారతి చట్టం రూపకర్తలలో ముఖ్యులైన ప్రముఖ న్యాయవాది భూమి సునీల్, లీఫ్స్ సంస్థ భూ న్యాయ నిపుణులు రెవెన్యూ అధికారులు రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి లీఫ్స్ గ్రామీణ న్యాయ పీఠం అడ్వైజర్ కరుణాకర్ దేశాయి తదితరులు ఈ సదస్సులో పాల్గొంటారు. గ్రామాలలో స్వచ్చందంగా రైతులకు ఉచిత న్యాయ సేవలు అందించాలనుకునే వారికి లీఫ్, గ్రామీణ న్యాయ పీఠం సంస్థలు భూ చట్టాలు – రైతు చట్టాలు గురించి ట్రైనింగ్ క్లాసులు నిర్వహించనున్నాయి అని అర్హత సాధించిన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేసి గ్రామాల్లో వలంటీర్లుగా నియమించనుంది కావున అధిక సంఖ్యలో నియోజకవర్గ రైతులు పాల్గొని విజయవంతం చెయ్యగలరు అని తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top