జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 31 at 1.27.32 PM

TRINETHRAM NEWS

Congress: మా పార్టీకి పదేళ్ల అరణ్యవాసం ముగిసింది: కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి

వేంపల్లె: 2024 ఏడాది కాంగ్రెస్‌దేనని ఆ పార్టీ సీనియర్‌ నేత తులసిరెడ్డి (Tulasi Reddy) ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి పదేళ్ల అరణ్యవాసం ముగిసిందని వ్యాఖ్యానించారు..

వైఎస్‌ఆర్‌ జిల్లా వేంపల్లెలో మీడియాతో ఆయన మాట్లాడారు..

”ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 2024లో కేంద్రం, ఏపీలో కాంగ్రెస్‌ (Congress) అధికారంలోకి వస్తుంది. మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టి అప్పుల భారత్‌ చేసింది. ప్రత్యేకహోదాకు పంగనామాలు పెట్టి ఏపీకి తీరని ద్రోహం చేసింది. జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది. ప్రజల చూపు ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు మళ్లింది. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి రావడం తథ్యం” అని తులసిరెడ్డి జోస్యం చెప్పారు..

You cannot copy content of this page