Goal : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం మా లక్ష్యం

TRINETHRAM NEWS

తేదీ : 07/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, మండలం లో ఉన్నటువంటి సమిటి వారి గూడెం, ఏసీ అగ్రహారం, మల్లాయిగూడెం, రాఘవపురం ,కమలాపురం మండల ప్రజా పరిషత్, ఫౌండేషన్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సరస్వతి దేవి, కొండ, రమణ, మజీద్ ఆలీ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ప్రభుత్వం సమయం ప్రకారం పాఠశాలలు తెరుస్తున్నామని, అదేవిధంగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, కొత్తగా ఎంతమంది జాయిన్ అయ్యారో తెలిపారు.

డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద విద్యార్థులకు ప్రతిరోజు సన్న బియ్యంతో కూడిన అన్నము, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు , రోజు విడిచి రోజు రాగి జావా, బెల్లం మరియు వేరుశనగ గింజలతో తయారుచేసినటువంటి చిక్కీలు తో కూడిన శక్తివంతమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని అన్నారు. తల్లికి వందనం విద్యార్థులందరికీ వాళ్ల తల్లుల బ్యాంకు ఖాతాలో పడ్డాయని పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర సంబంధించిన సామాగ్రి విద్యార్థులకు అందించామని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Our goal is to shape

You cannot copy content of this page

Scroll to Top