Bhoomi Puja : రోడ్డు బాగు చేయడానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 07/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, మండలం లో ఉన్నటువంటి సమ్మెట వారి గూడెం నుండి గురుభట్ల గూడెం రోడ్లు పనులకు సంబంధించి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది.
అదేవిధంగా ఉమ్మడి కూటమి నాయకులు సంబంధిత అధికారులు కూడా కొబ్బరికాయలు కొట్టారు. రోడ్డు పనులు ఎటువంటి ఆటంకం కలగకుండా సక్రమంగా జరగాలని మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హనుమంతురావు, కార్యదర్శి శ్రీనివాసరావు, కృష్ణారావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలపడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs who performed Bhoomi Pooja

You cannot copy content of this page

Scroll to Top