జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 20/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, మండలంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ డాక్టర్ పి. శ్రీనివాసరావు అన్నారు. ఈ కళాశాలలో బిఏ మరియు బిఎస్సీ ,బీకాం గ్రూపులు ఉన్నాయని తెలిపారు. బిఏ లో హానర్స్ చరిత్ర, బీఎస్సీలో హోనోర్స్ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, బోటనీ, అదేవిధంగా బీకాం లో హొనొర్స్ జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఉన్నాయని అన్నారు. కళాశాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే సుదీర్ఘమైనటువంటి క్రమశిక్షణతో కూడినవిద్య బోధన, అనుభవం, అత్యధిక పీహెచ్ డీ డిగ్రీ పొందిన అధ్యాపక బృందం చే తరగతులు, చెప్పబడుతున్నాయి.
చదువులు వెనకబడినటువంటి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, డిజిటల్ తరగతి గదులు , లైబ్రరీ విశాలమైన సెమినార్ హలు, పచ్చదనం లాంటి విశాలమైన ఆటస్థలం వివిధ ఆటలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం. జరుగుతుంది. విద్యార్థుల రక్షణ కొరకు ప్రత్యేకమైనటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం, ఫీజు రిమెంబర్ మెంట్ సౌకర్యం, ఇవ్వడం జరుగుతుంది. ఆంగ్ల మధ్యమంలో విద్యా బోధన, నేటితర విద్య నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రెగ్యులర్ తరగతులతో పాటు వివిధ జాబ్ ఓరియంటెడ్ సర్టిఫికెట్ల కోర్సులు నేర్పించబడుతున్నాయి.

ఎన్ ఎస్ ఎస్ విభాగ సేవా తప్పరత సంబంధిత పాత్య స్థాయి క్రీడా పోటీలలో విద్యార్థుల ప్రతిభను కనబరుస్తున్న కళాశాల క్రీడా విభాగం ఈ కాలేజీలో ఉన్నది. అవుతున్న లేబోరేటరీలు, పీజీ ప్రవేశ పరీక్షలకు , ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి , అదేవిధంగా దూర ప్రాంతాల నుండి కూడా ఈ కళాశాలకు విద్యార్థులు వస్తున్నారని తెలిపారు. విద్యార్థులను తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Our goal is to educate

You cannot copy content of this page