TRINETHRAM NEWS

ఎం.జీ.ఎం.హాస్పిటల్ లో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వేన్షన్ సెంటర్ లో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించిన

డి.ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్.సాంబశివరావు

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, వరంగల్ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.బీ.సాంబశివరావు వైద్య శిబిరం గురించి ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నపిల్లలలో వచ్చు గుండె సంబంధిత వ్యాధులను (డి.ఈ.ఐ.సి)- డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ద్వారా ముందుగానే గుర్తించి వారికి సంబంధించిన గుండె పరీక్షలు గాని ,ఆపరేషన్ గాని ,మేల్కొని చేయించినచో వారి భవిష్యత్తులో మంచి బాటలు వేసిన వారమవుతామని తెలిపినారు హైదరాబాద్ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో గుండె వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. చిన్న పిల్లలు వయసు సుమారు పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ గుండె వైద్య శిబిరం నిర్వహించినారు..

ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి 218 మంది పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులకు వైద్యులు పరీక్షలు చేశారు. ఇందులో చాలా మంది పిల్లలకు 2 డి కో పరీక్షలు చేశారు. వైద్య శిబిరంలో చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్ చేయుటకు సూచనలను అక్కడికి వచ్చిన వారికి తెలియజేశారు. వీరందరిని హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ నందు ఆపరేషన్లు సాధ్యమైనంత త్వరలో నిర్వహిస్తామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్ సాంబమూర్తి, డాక్టర్ ఉమామహేశ్వరి ,డాక్టర్ శ్రీరామ్ ,డాక్టర్ తమాసి మేనేజర్ అభిషేక్ ,ఎంజీఎం సూపరిండెంట్ డాక్టర్ మురళి , డిస్టిక్ ఇమనైజేషన్ ఆఫీసర్ (డీ.ఐ.ఓ.)డాక్టర్.ఐ.ప్రకాష్ ఎం.జీ.ఎం. ఆర్.ఎం.వో.డాక్టర్ అంబి శ్రీనివాస్ , డాక్టర్ రవీందర్ , డాక్టర్.సుమన్, డాక్టర్.

శ్రీనివాస్, డాక్టర్ దుర్గాప్రసాద్, డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ సిబ్బంది పీడియాట్రిషన్ మంజుల నాయక్, డెంటల్ సర్జన్ డాక్టర్. లక్ష్మి, డెంటల్ టెక్నీషియన్ నూర సంపత్ కుమార్, డైక్ మేనేజర్ మెరుగు అనిల్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ పవన్ కుమార్, సైకాలజిస్ట్ ప్రశాంత్, ఆడియాలజిస్ట్ వనజ ,ల్యాబ్ టెక్నీషియన్ మాధవి , నర్సింగ్ ఆఫీసర్ హేమ, సోషల్ వర్కర్ లావణ్య, స్పెషల్ ఎడ్యుకేటర్ రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App