‘Operation Vajra Prahar’ : మండపేటలో ‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’… సీఐ సురేష్ ఆధ్వర్యంలో గంజాయిపై విస్తృత తనిఖీలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, మండపేట పట్టణంలోని గొల్లపుంత ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మండపేట టిడ్కో సముదాయం వద్ద నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో పట్టణ సీఐ డి. సురేష్ పాల్గొన్నారు.
తెల్లవారుఝామునే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు టిడ్కో సముదాయం వద్ద మోహరించి అపార్ట్మెంట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి నియంత్రణే ప్రధాన లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. అదే విధంగా రికార్డులు సక్రమంగా లేని 11 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనుమానితుల నుండి వేలిముద్రలను కూడా సేకరించారు.
కార్యక్రమానికి ముందు సీఐ సురేష్ స్థానిక ప్రజలతో గంజాయికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఎవరైనా గంజాయి అమ్మకాలు సాగించినా లేదా గంజాయి సేవించినా సంబంధిత వ్యక్తుల వివరాలను 9440796591 నంబర్‌కు తెలియజేయాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ప్రజలంతా గంజాయి రహిత సమాజం కోసం పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్‌ఐ రాము, రూరల్ ఎస్‌ఐ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

‘Operation Vajra Prahar’ in Mandapet

You cannot copy content of this page

Scroll to Top