Kondareddy : స్వదేశీ వస్తువులే కొనుగోలు చేయాలి

TRINETHRAM NEWS

తేదీ : 26/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ టిడిపి అధ్యక్షులు కొండ్రెడ్డి. కిషోర్ మాట్లాడుతూ ఆత్మ నిర్భర్, వికసిత్ భారత్ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోధీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్వదేశీ జిఎస్టి రెండు.సున్న తో సంస్కరణలు ప్రతి ఇంటా తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలని, అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని, ఈనెల అనగా సెప్టెంబరు ఇరువై రెండు వ తేదీన జీఎస్టీ ని అమల లోకి తీసుకురావడం వల్ల ప్రజలపై ఖర్చు భారం తగ్గిందని తెలిపారు.

దీనివల్ల రైతులు మరియు విద్యార్థులకు, ఒక విధంగా చెప్పాలంటే ప్రజలందరకు తినే వస్తువు నుండి ఇంట్లో వాడుకునే వస్తువు వరకు , మరింతగా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. వాహనాలు, ఎలక్ట్రానిక్ సంబంధించి కూడా, ప్రతి ఒక్కరికి ఊరట లభిస్తుందని సూచించారు, ప్రాణాధార మందులు, ఆరోగ్య భీమా వార్షిక ప్రీమియంపై కూడా జీఎస్టీ వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Only indigenous goods should be purchased

You cannot copy content of this page

Scroll to Top