
ఉమ్మడి కృష్ణాజిల్లా వాలంటీర్లకు పోలీసులు గురువారం ప్రకటన జారీ చేశారు. పోలీసు అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్‌కు స్పందించవద్దన్నారు. ఆన్లైన్ లోన్ సైబర్ నేరగాళ్లు అధికారుల పేరుతో, వాలంటీర్లకు ఫోన్ చేసి ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. అటువంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇటీవల లోన్ రికవరీ ఏజెంట్లు సైబర్ నేరగాళ్లు ఆగడాలు పెరిగిపోవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.
