No Drugs Bro : విద్యార్థి దశ నుండే మంచి నడవడిక కలిగి ఉన్నత స్థాయికి చేరాలి

TRINETHRAM NEWS

-సీఐ విద్యాసాగర్
-ఎసై జి నరేష్

డ్రగ్స్ వద్దు బ్రో! యువత భవిష్యత్తు, మహిళలు రక్షణ కోసం జూనియర్ కాలేజీ లో పోలీసుల చైతన్య కార్యక్రమం

త్రినేత్రం న్యూస్, డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలం కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంగళవారం పోలీసు ఉన్నతధికారులు విద్యార్థులకు ప్రేరణాత్మకమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో “డ్రగ్స్ వద్దు బ్రో”, సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నియమాలపై ముఖ్యమైన విషయాలను వివరించారు.విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసే విషాదకర మత్తుపదార్థాల వాడకానీకి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్ వల్ల శరీరానికి మరియు మనసుకు కలిగే దుష్ప్రభావాలను వివరించి, వాటి నుండి దూరంగా ఉండమని సూచించారు.సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ గేమింగ్ లేదా మోసపూరిత వెబ్‌సైట్ల ద్వారా తరచూ జరిగే మోసాలపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, అనుమానం కలిగినపుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, గౌరవం మరియు సురక్షిత వాతావరణాన్ని కల్పించడం యువత కర్తవ్యమని గుర్తు చేశారు.అలాగే, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని, హెల్మెట్,వాడకం తప్పనిసరి అని చెప్పారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చైతన్య కలిగించడంతో పాటు మంచి పౌరులుగా ఎదగడానికి విలువైన సందేశం ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

One should have good conduct from the student stage

You cannot copy content of this page

Scroll to Top