జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ప్రభుత్వాసుపత్రిలో పండ్లు పంపిణీ .
డిండి (గుండ్లపల్లి) మే 08 త్రినేత్రం న్యూస్. రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవం (మే 8) సందర్భంగా గురువారండిండి (గుండ్లపల్లి )మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ శాశ్వత సభ్యుడు కోట్ల గౌతమ్ మాట్లాడుతూ, రెడ్ క్రాస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తుందని అన్నారు. రెడ్ క్రాస్ సంస్థలో చేరి సమాజానికి సేవలు అందించాలని కోరారు. ప్రపంచంలో ఎక్కడ అత్యవసర పరిస్థితులు ఏర్పడిన అక్కడ రెడ్ క్రాస్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఆస్పత్రికి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Red Cross Foundation Day

You cannot copy content of this page