జూన్ 26, 2026
TRINETHRAM NEWS

సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్లు అర్పించారు
గోదావరిఖని మార్చి-10// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆర్జీ-1 సబీసీనా ప్రెసిడెంట్ వసంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చీఫ్ అడ్వైజర్ శ్రీ చిలుక శ్రీనివాస్ సెక్రటరీ దేవ చారి, ట్రెజరర్ దేవులపల్లి రాజేందర్ , ఆర్జీ -2 ఇంచార్జ్ అనుమాండ్ల నవీన్ కుమార్, అల్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్, ఇతర బీసీ నాయకులు హాజరయ్యారు..
ఈ సందర్భంగా చిలుక శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రి భాయ్ సేవలను కొనియాడారు ఆధునిక భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త, కవయిత్రి & మహాతల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి.
ఈ దేశంలో సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత,విద్య ద్వారానే బడుగు బలహీన & పేద వర్గాలకు విముక్తి లభిస్తుందని నమ్మి పేద విద్యార్థులు, మహిళల హక్కుల కోసం తన జీవిత కాలం పోరాటం చేసిన క్రాంతిజ్యోతి మహాతల్లి సావిత్రిబమ రాబోయే రోజుల్లో బీసీ కులాల సంక్షేమానికి, అభివృద్ధికి అందరూ కృషి చేయాలని, బీసీ లు అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Savitribai Phule's death anniversary

You cannot copy content of this page