జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 19/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ పట్టణంలో ఇరవై ఏడు,నాలుగు,ఐదు వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెని గండ్ల రాము నిర్వహించడం జరిగింది. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వీధి వీధినా ఆయనకు ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు. సూపర్ సిక్స్ లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసి అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి అందిస్తున్నామని తెలిపారు. ఈ పాలనపై ప్రజలను అడగగా సూపర్ గా ఉందని ప్రజలు చెప్పడం జరిగింది.ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలపర్తి .శ్రీనివాసరావు, గుడివాడ టిడిపి అధ్యక్షులు డి. రాంబాబు నాయకులు సాంబశివరావు, ఉమా, లింగం ప్రసాద్, చేకూరు. జగన్మోహన్రావు, కంచర్ల. సుధాకర్, సంబంధిత వార్డులకి సంబంధించి ఉమ్మడి కూటమి నాయకులు, పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

On the governance of

You cannot copy content of this page