అన్ని రకాల సదుపాయాలతో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు
ఫారెస్ట్ అకాడమీ రాజానగరంలో ఏర్పాటు చేస్తున్నందుకు ప్రజల తరపున ధన్యవాదాలు
కేంద్రమంత్రి గజెంద్రసింగ్ షెకావత్ కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,కి ఘన స్వాగతం పలుకుదాం..
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా రాజనగరం, ఈ నెల 26 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, కొణిదెల పవన్ కళ్యాణ్, రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు లో ఫారెస్ట్ అకాడమీ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్న తరుణంలో మంగళవారం దివాన్ చెరువు ఫారెస్ట్ ఆఫీస్ వద్ద ఈస్ట్ జోన్ డి ఎస్ పి, ఫారెస్ట్ అధికారులు, జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నేతృత్వంలో, ఉపముఖ్యమంత్రి, కొణిదెల పవన్ కళ్యాణ్, ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం నడుస్తుంది.. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో తీసుకువెళ్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం విభజన అయిన తర్వాత మన రాష్ట్రంలో ఫారెస్ట్ సిబ్బంది శిక్షణ తీసుకోవడానికి సరైన అకాడమీ లేక ఇబ్బంది పడ్సడారు. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు, సరైన వనరులు లేకపోవడం వలన ఫారెస్ట్ సిబ్బందికి సరైన శిక్షణను అందించడానికి అవకాశం లేకుండా పోయింది. తాత్కాలికంగా శిక్షణ అందిస్తూ ఫీల్డ్ కు పంపించడం జరిగింది. సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఫారెస్ట్ అకాడమీ కావాలి, ఫారెస్ట్ సిబ్బందికి మంచి శిక్షణ ఇవ్వడానికి అకాడమీ కావాలని అనుకున్నప్పుడు అది మన రాజానగరం నియోజకవర్గానికి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ని, ఉపముఖ్యమంత్రి, కొణిదెల పవన్ కళ్యాణ్,ని పలు మార్లు కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ ప్రాంతం రిజర్వు ఫారెస్ట్ కాబట్టి గత ప్రభుత్వంలో ఫారెస్ట్ అకాడమీ ఇక్కడకి రాదు అని విడిచిపెట్టేసారు.. ప్రస్తుతం కేంద్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉండటం వలన మనం అందజేసిన వినతి పత్రాలను పరిగణలోకి తీసుకుని శ్రీ పవన్ కళ్యాణ్, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు ప్రాంతం ఫారెస్ట్ అకాడమీ పెట్టేందుకు అనుకూలమైన ప్రాంతమని నిర్ణయించి ఈ ప్రాంతానికి ఫారెస్ట్ అకాడమీ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ నెల 26 న పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు, స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, నాయకుల సమక్షంలో ప్రారంభోత్సవం జరుగుతుంది.
పవన్ కళ్యాణ్, పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఫారెస్ట్ అధికారులు సిద్ధం చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, అన్ని పనులు దగ్గరుండి పరిశీలిస్తూ కావలసిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు జరగబోయే ప్రారంభోత్సవం కార్యక్రమానికి విచ్చేసే అతిధులకు గాని, ప్రజలకు గాని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను చేస్తున్నారన్నారు. ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే రేపు 26 న రాజానగరం నియోజకవర్గానికి మొట్టమొదటి సారి విచ్చేస్తున్న కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,కి ఘన స్వాగతం పలకాలి. ఈ సమయంలో జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలి. ఈ కార్యక్రమానికి రాజానగరం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పాల్గొనాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానన్నారు..
ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు, జనసేన, తెలుగుదేశం, బిజేపి కూటమి నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


