Trinethram News : రాజమహేంద్రవరం: ఈనెల 14’న ఆర్యాపురం శ్రీ కృష్ణ చైతన్య మిషన్, ఆశ్రమంలో శ్రీ కృష్ణ చైతన్య మహా ప్రభువుల 538 ఆవిర్భావ మరియు ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ ఇన్చార్జి శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి తెలిపారు.ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన,8 గంటలకు స్వామివారికి అభిషేకం,అర్చన శృంగార హారతి,10 గంటలకు హోమం, పూర్ణాహుతి,
ధ్వజస్తంభం పునః ప్రతిష్ట మహోత్సవం జరుగనుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.సాయంత్రం 6.30 నుంచి వర్తమాన ఆచార్య భక్తికంకణ వన మహారాజ్ చే మహాప్రభువుల లీలా ప్రవచనం,మహా అభిషేకం,108 రకాల పిండివంటలతో మహారాజభోగం,హారతి,హోలీ, తీర్థప్రసాద వితరణ జరుగుతాయని, భక్తులంతా కార్యక్రమాల్లో పాల్గొనాలని శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


