Oil Supply Disruption : చమురు సరఫరాకు అంతరాయం.. భారత్‌కు 95 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు

TRINETHRAM NEWS

Trinethram News : పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్‌కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం కేవలం 25 రోజులకు సరిపడ ముడి చమురు నిల్వలు మాత్రమే భారత్‌ వద్ద ఉన్నాయి. అదేవిధంగా గ్యాసాయిల్‌, గ్యాసోలిన్‌, ఎల్‌పీజీ కూడా పరిమిత పరిమాణంలోనే రిఫైనరీల వద్ద ఉన్నాయి. రానున్న 10-15 రోజులు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. భారత్‌ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో దాదాపు 40% హొర్ముజ్‌ ద్వారా జరుగుతున్నది.

ఈ జలసంధి మార్గం దాదాపు మూతపడడంతో ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత్‌ అన్వేషించక తప్పని పరిస్థితి నెలకొంది. భారతీయ రిఫైనరీలు రోజుకు సుమారు 56 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తాయి. అమెరికా-ఇజ్రాయెల్‌ ఉమ్మడి దాడుల దరిమిలా ఇరాన్‌ ప్రతిదాడులకు పాల్పడడంతో హొర్ముజ్‌ జలసంధి సమీపంలో వందలాది చమురు నౌకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చమురు సరఫరాకు రష్యా అంగీకరించినట్టుసమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Oil supply disruption

You cannot copy content of this page

Scroll to Top