Trinethram News : Andhra : రాష్ట్రంలోని సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, వాడపల్లి, బెజవాడ కనకదుర్గమ్మ వంటి 22 ప్రధాన ఆలయాల్లో తరచూ తనిఖీలు నిర్వహించేందుకు అధికారులను నియమించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాలిచ్చారు. క్యూలైన్ల ఏర్పాటు, దర్శనాలు, ప్రసాదాల నాణ్యత, తాగునీటి సౌలభ్యం, పరిసరాల పరిశుభ్రత వంటి విషయాలను తరచూ ఈ అధికారులు పర్యవేక్షిస్తారు. ఎలాంటి లోపాలున్నా సరిదిద్దేలా చర్యలు తీసుకుంటారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


