అల్లూరి జిల్లా అరకులోయ,జనవరి 4, (త్రినేత్రంన్యూస్) : “మీ ఇంటికి మీ డాక్టర్” ప్రాజెక్టును ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఏపీ రాష్ట్ర శాఖ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఫౌండేషన్,న్యూఢిల్లీ ఆర్థిక సాయంతో ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుంది అని అల్లూరి జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ తెలిపారు. పేద, మారుమూల మరియు అందుబాటులోలేని గిరిజన కుటుంబాలకు ఈ ప్రాజెక్టు వర్తిస్తుందని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఆధ్యక్షులైన గవర్నర్ ప్రారంభించను న్నారు. జిల్లాలో రూ.8.41 కోట్లతో మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్టు అమలు అవుతుంది. ప్రజలకు మొబైల్ హెల్త్ క్లినిక్స్ ద్వారా ఇంటి వద్దకే ప్రాథమిక వైద్య సేవలు అందించడం, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థతో కలిసి మొబైల్ హెల్త్ క్లినిక్స్ నిర్వహణతో ప్రజారోగ్య వ్యవ స్థను బలో పేతం చేయడం, మాతా శిశు మరణాలు తగ్గించడం, సంక్రమణ వ్యాధుల నియంత్రణ, ప్రాజెక్టు ప్రాంతం లో నూరు శాతం టీకాలు అందించడం లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.
మొబైల్ హెల్త్ క్లినిక్ నిమిత్తం డాక్టర్, నర్స్, ఫార్మసిస్ట్, డ్రైవర్ పోస్టు లకు అభ్యర్థులు నుంచి దరఖాస్తులు ఆహ్వాని స్తున్నా మని జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ తెలిపారు.
డాక్టర్, నర్స్, ఫార్మసిస్ట్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
డాక్టర్లకు విద్యార్హత: ఎంబీబీఎస్, ఎండి, నెలవారీ వేతనం: రూ.80 వేలు, నర్సుకు విద్యార్హత: జీఎన్ఎం, బీఎస్సీ చదివి ఉండాలి. నెలవారీ వేతనం: రూ.25 వేలు, పార్మసిస్ట్కు ఆర్హత: బి.పార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివి ఉండాలి. నెలవారీ వేతనం: రూ 18 వేలు, డ్రైవర్: హెవీ వాహనాలు నడిపేందుకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, కనీసం అయిదేళ్ల అనుభవం అవసరం.
వేతనం: రూ.18 వేలు డాక్టర్, నర్స్, ఫార్మసిస్టు పోస్టులకు మహిళా అభ్యర్థులే అర్హులు. డ్రైవర్ పోస్టుకు స్త్రీ, పురుషులు అర్హులు, ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాతో కూడిన దరఖాస్తులను paderuredcross@gmail.com, redcrossap @gmail.com జనవరి 15 2026లోపు పంపాలని జిల్లా కలెక్టర్, ఏ ఎస్ దినేష్ కుమార్ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


