త్రినేత్రం న్యూస్ పెనుమూరు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో పెనుమూరులోని ముత్యాలమ్మ గుడి కోనేరు ఆవరణలో హిందూ సమ్మేళనం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ వశిష్టాశ్రమ లలితా పీఠం వ్యవస్థాపక పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంలో శివాలయం దగ్గర స్వామివారికి ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్క నుండి శ్రీవిద్య స్కూల్ పిల్లలు, శ్రీ వెంకటేశ్వర స్కూల్ పిల్లలు కలిసి సంకీర్తనలతో పీఠాధిపతిని శివాలయం దగ్గర నుండి వేదిక దగ్గరకు తీసుకుని వచ్చారు. మహిళలు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.
అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. హరే రామ హరే కృష్ణ భజన బృందం వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల తెలుగుదేశం అధ్యక్షులు పెద్దినేని రుద్రయ్య నాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మన పెద్దలుఎంతో కష్టపడి హిందూ సాంస్కృతిని, సాంప్రదాయాలను మనకు వారసత్వంగా ఇచ్చారని దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనదేనని గుర్తు చేశారు.
అనంతరం పీఠాధిపతి స్వరూపానంద స్వామి మాట్లాడుతూ హిందువులు కులాలను పక్కనపెట్టి అందరూ ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మనదేశంలో హిందువుల జనాభా రోజురోజుకీ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోని హిందువు ల oదరిని ఏకం చేస్తూ హిందువుల ఐక్యత కోసం పరితపిస్తున్న విశ్వ నాయకుడు గా ఎదిగిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారేనని చెప్పారు. హిందువులు భారతదేశంలో హిందువులుగా బ్రతకాలంటే ఐక్యమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


