Encroachment of Water workers : వాటర్ వర్క్స్ స్థలం ఆక్రమణ పై చర్యలు శూన్యం

TRINETHRAM NEWS

అధికారుల నిర్లక్ష్యం…
హై కోర్టు ఆదేశాల ధిక్కారం….
సర్వే లో జాప్యం…
రెడ్డి రాధాకృష్ణ ఆగ్రహం….

త్రినేత్రం న్యూస్, అక్టోబర్ 29, మండపేట వాటర్ వర్క్స్ లో స్తలం ఆక్రమణ కు గురైందని దీనిపై చర్యలు చేపట్టాలని తాము పలుమార్లు డిమాండ్ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తిన చందానా వ్యవహరిస్తున్నారని మండపేట మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశం లో ఆయన మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏ మేరకు అమలు చేశారని కమీషనర్ ను నిలదీశారు. వాటర్ వర్క్స్ ఆక్రమణల పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారి కడియాల రమ్య మాట్లాడుతూ తమ వద్ద ఆ స్తలం కు సంబంధించి ఎలాంటి రికార్డు లేదన్నారు.
దీనికి రెడ్డి రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.రికార్డు లేనప్పుడు గతంలో కౌన్సిల్ అజెండా లో 18.02 ఎకరాలు ఉన్నట్లు ఎలా చెప్పారని నిలదీశారు. అవార్డు కాపీ మున్సిపాల్టీ లో లేదని రమ్య సమాధానం ఇచ్చారు. కేవలం మునిసిపల్ ల్యాండ్ విస్తరణ లో ఉందని పేర్కొన్నారు. సర్వే నిర్వహించాల్సి ఉండగా మీనా మేషాలు లెక్కిస్తున్నారని రాధాకృష్ణ దుయ్యబట్టారు. డ్రోన్ సర్వే గంటలో పూర్తి అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో వైసీపీ ప్రభుత్వం జగనన్న భూ సర్వే చేసిందన్నారు. అప్పట్లో మండపేట పట్టణం లో ఈ సర్వే జరగలేదన్నారు. సర్వే జరిగిన చోట వాస్తవానికి ఎవరి ఆధీనం లో స్తలం ఉంటే వారికే కేటాయిస్తూ రికార్డ్ చేశారన్నారు.

దీనిపై తాము ప్రతిపక్షంలో ఉండగా ఈ సర్వే తప్పుల తడక అని విమర్శించిన విషయం గుర్తు కు చేశారు. వీటిని సరిచేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పిందన్నారు. ఈ అంశం ముఖ్య మంత్రి దృష్టి కి తీసుకుని వెళ్లినట్లు చెప్పారు.చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి మాట్లాడుతూ అసలు వాటర్ వర్క్స్ మొత్తం ఎంత విస్తరణ లో ఉందో చెప్పంటే అధికారులు చెప్పలేక పోతున్నారనీ విమర్శించారు. దీనిపై కమిషనర్ టీవీ రంగారావు వివరణ ఇస్తూ ఇప్పటికే సర్వే చేశామని నివేదిక వచ్చిన అనంతరం ఆక్రమణ లు ఉంటూ వెంటనే వారికి నోటీసులు ఇచ్చి తొలగిస్తామని ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

encroachment of water works site

You cannot copy content of this page

Scroll to Top