త్రినేత్రం న్యూస్ సెప్టెంబర్ 18, తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గానికి చెందిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం అధ్యక్షుడిగా బిక్కవోలు మండలం, కాపవరం గ్రామానికి చెందిన నిడదవోలు శ్రీనివాస్,ని నియమించారు. పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నియామకానికి సంబంధించి జరిగిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్, ని సన్మానించి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పోతుల ప్రసాద్ రెడ్డి (బుజ్జి) (బిక్కవోలు మండల కన్వీనర్), మారెళ్ళ భీష్ముడు (ఎంపీటీసీ సభ్యుడు), బొడ్డు ముత్యాలరావు (రాష్ట్ర బూత్ కమిటీ సెక్రటరీ), సత్యంశెట్టి వెంకటరమణ (గ్రామ సర్పంచ్), పోసిన గోపాలకృష్ణ (ఉప సర్పంచ్), గంగులూరి సూరిబాబు (పంచాయితీ 1వ వార్డు సభ్యులు), కొట్టు వీర వెంకట్రావు (గ్రామ అధ్యక్షులు), సత్యంశెట్టి గోవిందరాజు (గ్రామ ఉపాధ్యాయులు), ఆచంటి సతీష్ (హై స్కూల్ మాజీ చైర్మన్) తదితర నాయకులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


