AITUC : ఎన్డీఏ కూటమి ప్రభుత్వo పారిశుధ్య కార్మికులపై మొండి వైఖరి విడనాడాలి

TRINETHRAM NEWS

ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చేయాలి

త్రినేత్రం న్యూస్ : ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్…. కాకినాడ,ఏప్రిల్,16: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన కాకినాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బుధవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా జిల్లా లేబర్ కార్యాలయం నుండి కొండయ్య పాలెం సెంటర్, శారదా దేవి గుడి మీదుగా కమిషనర్ కార్యాలయం వద్దకు ర్యాలీ ప్రదర్శన జరిగింది.

ఆప్కాస్ కార్మికులకు వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయాలని, కుటుంబీకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సరకాలం పూర్తి కాకమునుపే మున్సిపల్ కార్మికులపై మొండి వైఖరి ప్రదర్శిస్తుందని ఆయన విమర్శించారు. ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయబోగా ఏ విధమైన నోటీసులు మంజూరు చేయకుండా 60 సంవత్సరాలు నిండిన కార్మికులను కాకినాడ కార్పొరేషన్ లో 13 మంది నుండి విధులకు నిలుపుదల చేయడమైనదని దానికి నిరసనగానే ఈరోజు కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేస్తున్నామని ఆప్కాస్, కాకినాడ స్పెషల్, టాయిలెట్ వర్కర్స్ తదితర కార్మికులకు రిటైర్మెంట్ వయసు పర్మనెంట్ ఎంప్లాయ్ వలే 62 సంవత్సరాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిస్థాయిలో వర్తింపచేయాలని, రిటైర్మెంట్ అయినా లేదా మృతి చెందిన వారి కుటుంబీకులకు మొదట ప్రాధాన్యతగా వారికిఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని,

మురికి కాలవలు తీయడం, కంపు కొడుతున్న చెత్త కుప్పల ఎత్తడం, మలినాలు వ్యర్థమైన పదార్థాలన్నీ శుభ్రం చేస్తూ 60 సంవత్సరాలు పాటు సుదీర్ఘంగా పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడి వారికి తక్షణమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ అయిన స్థానంలో కొత్తవారిని నియమించకపోవడం వల్ల ఆ పని భారం సానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రిలు, సెక్రెటరీ మోపుతూ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని, జనాభా ప్రతిపదికన తగు సిబ్బంది లేకపోవడం వల్ల పారిశుధ్య పనులు కుంటి పడుతుందని, మెరుగైన పారిశుధ్యం కొరకు అదనపు సిబ్బందిని నియమించాలని, అందులో రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వారి కుటుంబీకులకే మొదట ప్రాధాన్యతగాఉద్యోగ అవకాశాలు కల్పించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు. కొత్తగా నియమించిన సిబ్బందిని శానిటేషన్ లో పని చేయించకుండా ఆఫీసులో పనులు నియమించడంతో శానిటేషన్ పనులు పెండింగ్లో ఉంటున్నాయని ఆయన అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో జీవో నెంబర్ 15 వెనక్కి తీసుకొని తీసుకొని కార్మికులను కొనసాగించాలని ప్రసాద్ అన్నారు. ధర్నా అనంతరం నగరపల సంస్థ మేనేజర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు తుపాకుల లక్ష్మీనారాయణ, శ్రామిక మహిళా ఫారం నాయకురాలు పద్మ, బంగారు రాజేష్, బొబ్బిలి ఈశ్వరరావు, కౌలు శ్రీను, సత్యనారాయణ, లక్ష్మణ్, జనిపల్లి అప్పన్న, కటారి సత్యనారాయణ, ములికి సత్యనారాయణ, నిమ్మకాయల ఈశ్వరరావు, బంగారు హరికృష్ణ, రాళ్లపూడి వెంకన్న బాబు, బండి అప్పన్న తదితర 14 సర్కిల్లో ఉన్న మున్సిపల్ వర్కర్స్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NDA coalition government should

You cannot copy content of this page

Scroll to Top