‘National Science Day’ : ఘనంగా ‘నేషనల్ సైన్స్ డే

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) ఫిబ్రవరి 28, త్రినేత్రం న్యూస్. డిండి(గుండ్లపల్లి) మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ‘నేషనల్ సైన్స్ డే‘ వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. సర్ సి.వి. రామన్ పరిశోధన ఫలితం ‘రామన్ ఎఫెక్ట్’ను కనుగొన్న రోజును పురస్కరించుకొని పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

ప్రయోగాలపై అవగాహన:

ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేలా పలు రకాల ప్రయోగాలపై అవగాహన కల్పించారు. నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను, శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాల్సిన అవసరాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలు అలరించాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జీ హెడ్మాస్టర్ నాగేశ్వరరావు భూక్య, ఉపాధ్యాయులు లింగయ్య, లక్ష్మీ, వేణు, కేతావత్ సర్దార్ సింగ్ రాథోడ్, శ్రీనివాస్, శ్రీనయ్య, శోభన్ బాబు, వాసవి, పుష్పలత, రికార్డ్ అసిస్టెంట్ వావిళ్ళ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రయోగాలను ఉత్సాహంగా వీక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

'National Science Day' celebrated in grand style

You cannot copy content of this page

Scroll to Top