VC Acharya : 21, 22న గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ పై జాతీయ సదస్సు

TRINETHRAM NEWS

బ్రోచర్ ఆవిష్కరించిన వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఈ నెల 21, 22 తేదీల్లో “గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ పై జాతీయ సదస్సు” అనే అంశంపై నేషనల్ సెమినార్ నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ తెలిపారు. శనివారం విశ్వవిద్యాలయంలో నేషనల్ సెమినార్ కు సంబంధించిన బ్రోచర్ ను వీసీ ఆవిష్కరించి వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఐ.సి.ఎస్.ఎస్.ఆర్. మరియు ఎన్.సి.ఎస్.టి. ఆర్థిక సహకారంతో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సెమినార్ ద్వారా గిరిజన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, సంస్కృతి, ఆదివాసి సంపద, గిరిజన హక్కులు, విద్య, వైద్యం, గిరిజన స్త్రీ విద్య ఆవశ్యకత మొదలైన అంశాలు చర్చిస్తారని తెలిపారు.

వివిధ రాష్ట్రాల నుండి విద్యావేత్తలు, సామాజిక ప్రముఖులు, గిరిజన సలహాదారులు మరియు పరిశోధకులు పాల్గొని తమ పరిశోధన పత్రాలను, అభిప్రాయాలను పంచుకుంటారని చెప్పారు. ఈ నేషనల్ సెమినార్ కు చైర్మన్ గా ప్రిన్సిపాల్ ఆచార్య కె.సుబ్బారావు, కన్వీనర్ గా డా.ఆర్.ఎస్.వరహాలు దొర, సమన్వయకర్తగా డా.ఆర్.సాంబశివరావు, కోకన్వీనర్స్ గా డా.ఎం.గోపాలకృష్ణ, డా.జి.ఎలీషాబాబు, డా.జె.రాజమణి, డా.వి.రామకృష్ణ, డా.ఎన్.సుజాత, కె.ఎస్.ఆర్.రాజేశ్వరిదేవి వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. మరిన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్ సైట్ లో పొందుపరిచామని, అందరూ హాజరై సెమినార్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tribal Ancient Knowledge

You cannot copy content of this page

Scroll to Top