Narsa Reddy Bhupathi Reddy : చేవెళ్ల మున్సిపాలిటీ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని తెలిపిన నర్సారెడ్డి భూపతి రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు చేవెళ్ల మున్సిపాలిటీ చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ వార్డు అభ్యర్థి నరసింహులు, 10వ వార్డు అభ్యర్థి శంకర్ నందిమొల్ల, 13 వ వార్డు అభ్యర్థి కాసుల రాము గౌడ్, 17వ వార్డు అభ్యర్థి కృష్ణా నాయక్, 18వ వార్డు అభ్యర్థి మంగలి కళ్యాణి యాదగిరి లకు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి

ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల మున్సిపాలిటీ గడ్డమీద ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ప్రజలు కూడా 13వ తారీకు కాంగ్రెస్ విజయోత్సవాలలో పాల్గొనడానికి సన్నద్ధం అవుతున్నారని, చేవెళ్ల మున్సిపాలిటీ ప్రజలు అభివృద్ధిని గర్వంగా చెప్పుకునే రోజులు మున్ముందు రాబోతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి సమత వెంకటరెడ్డి, చేవెళ్ల వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ పెంటయ్య, వైస్ చైర్మన్ రాములు, సీనియర్ నాయకులు బండారి శైలజ అగిరెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు ప్రభాకర్, ప్రవీణ్ గౌడ్ కుత్బుల్లాపూర్ నాయకులు జలీల్ ఖాన్, రాధాకృష్ణ పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Narsa Reddy Bhupathi Reddy said that the Congress flag

You cannot copy content of this page

Scroll to Top